కలం, వెబ్ డెస్క్: ఏపీని అర్నబ్ తుఫాన్ (Arnab Cyclone) వణికిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలలకు హై అలర్ట్ ప్రకటించగా.. రైల్వే శాఖ అప్రమత్తమైంది. పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే గోదావరి ఎక్స్‌ప్రెస్, మహబూబ్ నగర్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-విశాఖపట్నం గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి-కాకినాడ మధ్య నడిచే కోకనాడ ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి-నరసాపురం ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి-కాకినాడ పోర్ట్ మధ్య నడిచే గౌతమి ఎక్స్‌ప్రెస్, నాందేడ్-సంబల్పూర్ మధ్య నడిచే నాగావళి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి-శ్రీకాకుళం రోడ్ స్పెషల్ ట్రైన్‌ను రద్దు చేశారు. ప్రయాణికులు తక్షణమే గమనించి.. టూర్ షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలని సూచించింది.

