గురుకులంలో విద్యార్థుల జల్సాలు.. మద్యం, సిగరెట్ తాగుతూ!

కలం, వెబ్‌డెస్క్: చదువుకోవాలస్సిన వయసులో విద్యార్థులు చదువును పక్కనపెట్టి జల్సాలు చేస్తూ, ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికేరాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల (Gurukul School)లో చోటుచేసుకుంది. విద్యార్థులు మద్యం, సిగరెట్ తాగుతూ, రీల్స్ చేస్తూ, కెమెరాకు ఫోజులు ఇస్తున్నారు. ఈ చర్యలను గురుకుల పాఠశాల ఆర్ట్ టీచర్ అచ్చయ్య ప్రోత్సహిస్తున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. అతడిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ విషయాన్ని స్థానికులు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి (MLA Virupakshi) దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గురుకుల పాఠశాలను శనివారం సందర్శించారు. ఆర్ట్ టీచర్ అచ్చయ్యపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>