ప్రజాప్రతినిధుల పాత్రల్లో విద్యార్థుల సందడి

కలం, లక్ష్మణచందా: లక్ష్మణచందా మండల కేంద్రంలోని పీఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన మాక్ పార్లమెంట్ (Mock Parliament) కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. పార్లమెంటు సమావేశాల నిర్వహణ, చర్చలు, ప్రశ్నోత్తరాల సమయం, సభ్యుల ప్రసంగాలు తదితర అంశాలను విద్యార్థులు ప్రత్యక్షంగా ప్రదర్శించి సభా కార్యక్రమాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రధానమంత్రి, స్పీకర్, మంత్రులు, ప్రతిపక్ష నాయకులు, పార్లమెంటు సభ్యుల పాత్రలను పోషించారు.

సభా కార్యకలాపాల నిర్వహణ, ప్రజా సమస్యలపై చర్చలు, వివిధ అంశాలపై ప్రశ్నలు సంధించడం, వాటికి మంత్రుల సమాధానాలు వంటి అంశాలను చక్కగా ప్రదర్శించారు. అధికార పక్షం, ప్రతిపక్ష సభ్యుల మధ్య జరిగిన చర్చలు పార్లమెంటు సమావేశాలను తలపించాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటు ప్రాధాన్యత, ప్రజాప్రతినిధుల బాధ్యతలు, చట్టాల రూపకల్పన, ప్రజా సమస్యల పరిష్కారంలో సభల పాత్రను విద్యార్థులు ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకున్నారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సంప్రదాయాలు, చర్చల ద్వారా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై అవగాహన పెంపొందించేందుకు మాక్ పార్లమెంట్ ఎంతగానో దోహదపడిందని ఉపాధ్యాయులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>