శ్రీసిటీలో భారీ పేలుడు: నలుగురు కార్మికులు మృతి

కలం, వెబ్ డెస్క్ : తిరుపతి జిల్లా సత్యవేడు మండలం పరిధిలోని శ్రీసిటీ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న టిల్ హెల్త్‌కేర్ (Teal Healthcare) పరిశ్రమలో భారీ ప్రమాదం (Sri City Boiler Blast) చోటుచేసుకుంది. శనివారం ఉదయం పరిశ్రమలోని బాయిలర్ ఒక్కసారిగా పేలిపోవడంతో కలకలం రేగింది. ఈ దుర్ఘటనలో నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు.

పేలుడు దాటికి ఘటనాస్థలంలో భారీగా శిథిలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. నైట్ షిఫ్ట్ ముగించుకుని షిఫ్ట్ మారే సమయంలో ఈ ప్రమాదం జరగడంతో విధుల్లో ఉన్న పలువురు కార్మికులు లోపలే చిక్కుకుపోయినట్లు సమాచారం. పేలుడు ధాటికి శ్రీసిటీ ప్రాంగణమంతా భారీ శబ్దం వినిపించడంతో స్థానికులు, ఇతర కార్మికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ టీమ్‌లు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని శ్రమిస్తున్నారు. ప్రమాద సమయంలో అక్కడ ఎంతమంది ఉన్నారనే వివరాలపై అధికారులు విచారణ వేగవంతం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>