కలం, వెబ్ డెస్క్ : మండుటెండలతో అల్లాడిపోతున్న ప్రజలకు గుడ్ న్యూస్ అందుతోంది. గురువారం కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. అనంతరం కేరళ, తమిళనాడు, కర్ణాటకలోకి నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) విస్తరించాయి. దీని ప్రభావంతో కేరళ తీర ప్రాంతాల్లో, చెన్నై తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. దీంతో ఇనాళ్లు ఎండ వేడితో ఉక్కిరిబిక్కిరైనా అక్కడి ప్రజలు ఉప శమనం పొందుతున్నారు.
మరోవైపు నైరుతి రుతుపవనాలు మరో రెండు రోజుల్లో ఏపీలోకి ప్రవేశించనున్నాయని విశాఖతుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. కోస్తాంధ్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, రాయలసీమలో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. అంతేకాదు ఏపనీలో పలు చోట్ల వారం రోజుల పాటు మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఎల్‌నిలో ప్రభావంతో ఈ సంవత్సరం నైరుతి రుతుపవన కాలంలో ( జూన్ – సెప్టెంబర్) సాధారణం కంటే తక్కవ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది.

