Mobile Popup Ad
Mobile Popup Ad

గంభీర్ కు అదే అసలైన పరీక్ష: గంగూలీ

కలం, వెబ్​ డెస్క్​ : టీమిండియాకు వరుసగా రెండో టీ 20 ప్రపంచకప్ సాధించడంతో హెడ్ కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) పేరు మారుమోగుతోంది. 2026 టీ 20 ప్రపంచకప్ సాధించడం ద్వారా తన హయాంలో రెండు ఐపీఎల్ ట్రోఫీలు అందించిన తొలి టీమిండియా హెడ్ కోచ్ గా గంభీర్ రికార్డు నెలకొల్పారు. గంభీర్ కోచింగ్ లోనే టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను కూడా సాధించింది. ఇక వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం గంభీర్ ఇప్పటికే ప్రిపరేషన్ మొదలుపెట్టారు. ఇలాంటి నేపథ్యంలో గౌతమ్ గంభీర్ కు రానున్నది గడ్డుకాలం అని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, టీమిండియా మాజీ ప్లేయర్ సౌరభ్ గంగూలీ (Sourav Ganguly) బాంబ్ పేల్చారు.

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ కోచింగ్ పై గంగూలీ (Sourav Ganguly) కీలక వ్యాఖ్యలు చేశారు. వైట్ బాల్ క్రికెట్ లో గంభీర్ మంచి కోచ్ అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పారు. అయితే వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ గంభీర్ కు అసలైన పరీక్ష అన్నారు. అక్కడి పరిస్థితులు గంభీర్ కు కఠినమైన సవాలే అని వ్యాఖ్యానించారు. కానీ ప్రస్తుత జట్టుతో అతడు విజయం సాధిస్తాడనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే రెడ్ బాల్ క్రికెట్ లో గంభీర్ మెరుగుపడాల్సిన అవసరం ఉందని గంగూలీ తెలిపారు. పిచ్ ల విషయంలో గంభీర్ ఎక్కువగా ఆలోచన చేయొద్దని సూచించారు. గంభీర్ స్వదేశంలో ఎక్కువగా స్పిన్ పిచ్ లను తయారు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఈ సందర్భంగా న్యూజిలాండ్, సౌతాఫ్రికా సిరీస్ లో టీమిండియా బోల్తా పడిన విషయాన్ని గుర్తు చేశారు. మంచి పిచ్ లు.. మంచి ఫలితాలను ఇస్తాయని గంగూలీ చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>