చైత‌న్య బ‌ర్త్‌డే.. స్పెష‌ల్ ఫోటోతో శోభితా విషెస్‌

క‌లం, సినిమా: అక్కినేని హీరో నాగచైతన్య (Naga Chaitanya)సోమ‌వారం గ్రాండ్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌ జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన భార్య, నటి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala) ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చైతన్యకు స్పెష‌ల్ విషెస్ చెప్పారు. తమ వెకేషన్‌కు సంబంధించిన కొన్ని అందమైన ఫోటోలను పంచుకుంటూ, “హ్యాపీ బర్త్‌డే లవర్” అంటూ క్యాప్షన్ జత చేశారు. అయితే, ఈ పోస్టులో వీరిద్దరూ ముద్దు పెట్టుకుంటున్న ఒక ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ జంట రొమాంటిక్ ఫోటో చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు.

మరోవైపు నాగచైతన్య ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘వృషకర్మ’ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను డిసెంబర్ 4న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఒకవైపు పుట్టినరోజు వేడుకలు, శోభిత సర్‌ప్రైజ్ విషెస్‌తో చైతన్య ఆనందంలో ఉండగా, మరోవైపు కొత్త సినిమా విడుదలకు సిద్ధమవుతుండటంతో అక్కినేని అభిమానుల్లో డబుల్ జోష్ కనిపిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>