epaper
Monday, March 2, 2026
epaper

ఆసుపత్రిలో అడ్మిట్ అయిన పలాష్ ముచ్ఛల్..

భారత మహిళా క్రికెట్ ప్లేయర్ స్మృతి మందానా(Smriti Mandhana)కు కాబోయే భర్త పలాష్ ముచ్ఛల్(Palash Muchhal) ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆదివారం వారిద్దరి వివాహం జరగాల్సి ఉండగా.. స్మృతి తండ్రి అనారోగ్యానికి గురయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో ఆయను హుటాహుటిన సంగ్లీలోని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే పలాష్‌కు కూడా ఆరోగ్యం క్షీణించింది. దీంతో అతనిని కూడా వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. అయితే పలాష్ విషయంలో కంగారు పడాల్సింది ఏమీ లేదని వైద్యులు చెప్పారు. అతను వైరల్ ఇన్ఫెక్షన్, ఎసిడిటీ కారణంగా అనారోగ్యానికి గురయ్యాడని వైద్యులు తెలిపారు. చికిత్స అందించి ఆదివారం రాత్రికి పలాష్‌ను డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు వెల్లడించారు. ఒత్తిడి ఎక్కువ కావడంతోనే పలాష్ అనారోగ్యానికి గురయ్యాడని కుటుంబీకులు తెలిపారు. ప్రస్తుతం పలాష్(Palash Muchhal) ముంబైలో ఉన్నట్లు చెప్పారు.

కాగా స్మృతి మందానా తండ్రి శ్రీనివాస్ మందానాకు ఇంకా ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ఛాతీలో నొప్పి రావడంతో అంబులెన్స్‌లో ఆయనను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతనికి అంజైనా పెక్టోరిస్ అనే లక్షణాలు కనిపించాయని, ఇది కోరోనరీ హార్ట్ డిసీజ్‌తో సంబంధం ఉన్న పరిస్థితి అని నిర్ధారించారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచినట్లు వెల్లడించారు. మరిన్ని పరీక్షలు చేసి అందించాల్సిన చికిత్సను ఫేనల్ చేస్తామని తెలిపారు వైద్యులు.

Read Also: మెస్సీ మరో రికార్డ్.. ప్రపంచంలో ఏకైక ఫుట్‌బాలర్‌గా..

Follow Us on: Youtube

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!