తెలంగాణ నయాగరా .. ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్న రాణి జానకీబాయి జలధార!

కలం, నిజామాబాద్ బ్యూరో : అన్నదాతల కోసం వ్యవసాయం పది కాలాల పాటు పచ్చగా వర్ధిల్లాలని సిర్నాపల్లి సంస్థానధీశురాలు రాణి శీలం జానకీ బాయి ఓ వినూత్న ఆలోచన చేశారు. పెద్ద చెరువు కట్టి కట్టకు బదులు తాళ్ళతో అడ్డుగా భారీ ఎత్తుతో చెక్ డ్యాం కట్టించారు. కుండపోత వర్గం కురిసిన ప్రతీసారీ నిండుకుండలా మారి ఆ చెరువు సత్ఫలితాలిచ్చింది. దీంతో ఆమె వ్యవసాయం కోసం, తాగునీటి కోసం చాలా చెరువులు కట్టించారు. సిర్నాపల్లి చెరువు నుండి వచ్చే నీరే వర్షాకాలంలో చెక్ డ్యామ్ పై నుండి పడి వాటర్ ఫాల్స్ లా (Sirnapalli Waterfalls)  కనిపిస్తుంది. అది తెలంగాణా నయాగరా లా పేరొచ్చింది.

ఈ వాటర్ ఫాల్స్ కు సిర్నాపల్లి సంస్థానపు రాణి శీలం జానకీబాయి పేరే పెట్టారు. నిజామాబాద్ నుండి 30 కిలోమీటర్లు హైదరాబాద్ నుండి 170 కిలోమీటర్ల దూరం ఉంటుంది. గత వారం పది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో సిర్నాపల్లి చెరువు జలకళ సంతరించుకొని మత్తడిపై దూకుతూ పరవళ్ళు తొక్కుతోంది. పర్యాటకంగా కూడా విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ వాటర్ ఫాల్స్ కు వెళ్లడానికి సిర్నాపల్లి వరకూ రవాణా మార్గం బాగుంది. అడవిలో రెండు కిలోమీటర్లు నడక బైక్ మార్గంలో వెళ్లాలి. హోటళ్లు అందుబాటులో ఉండవు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>