రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌లో సిరిపురం లావణ్యకు కీలక పదవి

కలం, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్‌పూర్ గ్రామానికి చెందిన సిరిపురం లావణ్య (Siripuram Lavanya) నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందుకున్నారు. గతంలో ఆమె కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.

ఈ సందర్భంగా తన నియామకానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబా, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, టీపీసీసీ అధికార ప్రతినిధి మేనేని రోహిత్ రావులకు సిరిపురం లావణ్య కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి బాధ్యతాయుతమైన పదవిని అప్పగించిన పార్టీ అధిష్టానానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలకు అనుగుణంగా మహిళా కాంగ్రెస్ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ మహిళా సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాడుతానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళలా విధేయతతో పనిచేస్తూ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తానని లావణ్య స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>