చిన్నారి జాహ్న‌వి మిస్సింగ్‌ కేసు పున‌ర్విచార‌ణ‌

క‌లం, వెబ్‌డెస్క్‌: ఏపీలో మిస్ట‌రీగా మారిన జాహ్న‌వి మిస్సింగ్ కేసు (Jahnavi Missing Case) పై హైకోర్ట్ కీల‌క ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై పున‌ర్విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆదేశించింది. దీంతో జాహ్న‌వి జాడ‌ను గుర్తించేందుకు తూర్పు గోదావ‌రి జిల్లా అద‌న‌పు ఎస్పీ దేవ‌రాజ్ మ‌నీష్ పాటిల్ ఆధ్వ‌ర్యంలో ముగ్గురు సీఐలు, న‌లుగురు ఎస్సైల‌తో ప్ర‌త్యేక బృందం ఏర్పాటైంది. జాహ్న‌వి మిస్సింగ్ కేసు న‌మోదై నేటితో 160 రోజులు అయ్యింది. తుని మండ‌లం సీహెచ్ అగ్ర‌హారంలో జూన్ 6న జాహ్న‌వి ఇంటి నుంచి క‌న‌ప‌డ‌కుండా పోయింది. జాహ్న‌వి ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆమెతో పాటు వాళ్ల ఇంట్లో పెంపుడు కుక్క కూడా వెళ్లింది.

అయితే ఆ కుక్క మూడు రోజుల త‌ర్వాత తిరిగి రావ‌డం, అనారోగ్యంతో చ‌నిపోవ‌డం కూడా జ‌రిగింది. జాహ్న‌వి జాడ కోసం పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్‌, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రోజుల త‌ర‌బ‌డి జాహ్న‌వి ఆచూకీ కోసం తిరిగాయి. చివ‌రికి పాప‌ను క‌నిపెట్టిన వారికి రూ.ల‌క్ష బ‌హుమ‌తి ఇస్తామ‌ని కూడా ప్ర‌క‌టించారు. అయినా పాప ఎక్క‌డుందో తెలియ‌లేదు. జాహ్న‌వి త‌ల్లిదండ్రులు 160 రోజుల నుంచి పాప తిరిగొస్తుంద‌న్న న‌మ్మ‌కంతో ఎదురుచూస్తున్నారు. జాహ్న‌వి ఇంటి చుట్టూ అట‌వీ ప్రాంతం కావ‌డంతో ఆచూకీ క‌నుగొన‌డం క‌ష్టంగా మారింది. పున‌ర్విచార‌ణ‌లో ఏం జ‌రుగుతుంద‌న్న‌ది ఉత్కంఠ‌గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>