పాట వివాదం.. సారీ చెప్పిన సింగర్ మంగ్లీ

కలం, వెబ్ డెస్క్: బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి, హీరో సంజయ్ దత్ నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం ‘కేడీ: ది డెవిల్’ (KD: The Devil) లోని ఓ పాట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ మూవీలోని ‘సర్కే చునర్ తేరీ సర్కే’ (Sarke Chunar Teri Sarke) అనే పాట నెట్టింట తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. పాటలోని డబుల్ మీనింగ్ డైలాగ్స్ శ్రోతలను ఇబ్బందులకు గురి చేస్తోంది. పాటలోని అశ్లీల సాహిత్యం, డబుల్ మీనింగ్ విజువల్స్ పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మూవీ మేకర్స్ వారిని సరిచేసే పనిలో పడ్డారు. తీవ్రమైన నెగిటివిటీని మూటగట్టుకున్న ఈ పాటను మన తెలుగు సింగర్ మంగ్లీ (Singer Mangli) పాడారు.

దీంతో తెలుగు అభిమానులు సైతం మంగ్లీని తీవ్రంగా తప్పుబడుతున్నారు. డబ్బు కోసం ఎలాంటి పాటలు అయినా పాడుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తాను (Singer Mangli) పాడిన ‘సర్కే చునార్‌ తేరి సర్కే’ పాట వివాదాస్పదం కావడంపై గాయని మంగ్లీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘అనుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు క్షమాపణలు. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం మాకు ఎప్పుడూ లేదు. జరిగిన దానికి చింతిస్తున్నాం. ఇలా మరోసారి జరగదు’’ అని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా రాసుకొచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>