కలం, వెబ్ డెస్క్ : 2026లో వెండి ధరలు (Silver Prices) భారీగా పెరగబోతున్నాయా అంటే అవుననే అంటున్నారు ట్రేడ్ నిపుణులు. వారం రోజుల కింద కిలో వెండి ధర రూ. 2,59,890 గా ఉండేది. ఇప్పుడు కిలో వెండి ధర రూ.291900గా ఉంది. అతి త్వరలోనే రూ.3లక్షలకు చేరవ కాబోతోంది. ఇప్పటికే దేశంలోని కొన్ని చోట్ల రూ.3లక్షలు పలుకుతోంది. బంగారంతో పోలిస్తే వెండి ధరల్లో పెరుగుదల చాలా ఎక్కువగా ఉంది. ఈ ఏడాది వెండి ధరలు ఇంకా పెరుగుతాయా.. ఈటీఎఫ్ లో పెట్టుబడులు పెట్టొచ్చా లేదా అనే డౌట్స్ చాలా మందికి ఉన్నాయి.
వెండి ధర పెరగడానికి కారణాలు..
వెండి ధర పెరగడానికి ప్రధాన కారణం ఎలక్ట్రిక్ వాహనాల వినయోగం పెరగడంతో పాటు సోలార్ ప్రాజెక్టులు ప్రపంచ వ్యాప్తంగా ఏర్పాటు కావడమే. ఈ సోలార్ ప్యానెల్స్ లో వెండిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఉన్న సోలార్ ప్యానెల్స్ కంటే ఇప్పుడు కొత్తగా వస్తున్న మోడళ్లలో 50 శాతం వెండిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అందుకే వెండికి ఈ రంగంలో డిమాండ్ ఎక్కువ అయిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో వెండిని ఎక్కువగా వాడుతారు. పెట్రోల్ లేదా డీజిల్ వెహికల్స్ తో పోలిస్తే ఈవీ వెహికల్స్ లో 80 శాతం వెండి ఎక్కువ వాడుతారు. అటు ఏఐ హార్డ్ వేర్ లలో, డేటా సెంటర్లలోనూ వెండిని ఎక్కువ వాడేస్తున్నారు. ఇవే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యుద్ధ వాతావరణాలు, ప్రపంచ మార్కెట్ లో అనిశ్చితి కారణంగా వెండిలో పెట్టుబడులు భారీగా పెరిగాయి. అందుకే ఈ వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ధరలు మరింత పెరుగుతాయా..?
2025 ఉన్న అనిశ్చిత పరిస్థితులే ఈ 2026లోనూ కనిపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాలు ఇంకా పెరుగుతున్నాయి. చాలా దేశాల్లో ఆర్థిక సంక్షోభాలు, స్టాక్ మార్కెట్ లో వెండి షేర్ వాల్యూకు డిమాండ్ ఉండటం లాంటివి చూస్తుంటే.. ధరలు (Silver Prices) ఇంకా పెరిగేలా కనిపిస్తున్నాయని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. అందులోనూ ఈవీ వెహికల్స్ కు భారీ డిమాండ్ ఉండటం, ఏఐ డేటా సెంటర్లు పెరగడం.. ఇవన్నీ కలిసి వెండికి డిమాండ్ పెంచేస్తున్నాయి. కాబట్టి ఈటీఎఫ్ లో ఇప్పుడు కొత్తగా వెండిపై పెట్టుబడులు పెడితే గతేడాది వచ్చినంత లాభాలు రాకపోవచ్చని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే గతేడాది ధరలు ఒకేసారి భారీగా పెరిగాయి. ఆల్రెడీ ధరలు పరిమితికి మించి పెరిగిపోయాయి. ఇప్పుడు కొత్తగా వచ్చే పెట్టుబడుల్లో ఆల్రెడీ పెరిగిన ధరల నష్టం కూడా ఉంటుంది. కాబట్టి ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకపోయినా.. క్రమంగా కొంత పెట్టుబడి పెడుతూ పోవడం మంచిదని సూచిస్తున్నారు.
Read Also: మున్సిపల్ రిజర్వేషన్లతో మెట్‌పల్లి నేతల రిలాక్స్..
Follow Us On: Pinterest


