కలం, మెదక్ బ్యూరో: ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యామోహంలో పడి చార్టర్డ్ అకౌంటెంట్ ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. గూడూరు సంతోశ్ (32) కొంతకాలంగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో భారీగా డబ్బులు నష్టపోవడంతో తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో సిద్దిపేట (Siddipet) బైపాస్ రోడ్డులోని ‘హరిత హోటల్’లో గది తీసుకున్న సంతోశ్… యూట్యూబ్‌లో చూసి ఆత్మహత్యకు ప్రణాళిక రచించాడు. ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి ప్రాణాలు విడిచాడు.
ఘటనా స్థలంలో పోలీసులకు సూసైడ్ నోట్ లభ్యమైంది. తనను క్షమించాలని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులను సంతోశ్ ఆ లేఖలో వేడుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

