బాసర ఆలయానికి మినీ బస్సు అందజేత

కలం, నిర్మల్: బాసర ఆలయానికి (Basara Temple) వచ్చే భక్తులకు ఇక నుంచి మినీ బస్సు అందుబాటులోకి రానుంది. ప్రఖ్యాత శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి ఈ మేరకు ఎస్‌బీఐ బ్యాంక్ మినీ బస్సును సమకూర్చింది. హైదరాబాద్‌‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఎస్‌బీఐ ఛైర్మన్‌ చల్లా శ్రీనివాసులు శెట్టి ఆలయ ఈవో అంజనీదేవి, సిబ్బందికి మినీ బస్సును అప్పగించారు. ఈ సందర్భంగా చల్లా శ్రీనివాసులు శెట్టిని ఈవో అంజనీదేవి అమ్మవారి జ్ఞాపికతో సత్కరించారు.

అనంతరం ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్‌ పాటక్‌, అర్చకులు మురళీ శ్రోతి, వేద పండితులు నవీన్‌ శర్మ మినీ బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. బాసర సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఉచిత రవాణా సేవలు అందించేందుకు బస్సును ఉపయోగిస్తామని పేర్కొన్నారు. ఎస్‌బీఐ ఆర్థిక సహకారంతో బస్సు సమకూరడం ఆలయానికి వచ్చే భక్తులకు మరింత సౌకర్యంగా ఉంటుందని అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>