కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంజులాపూర్ (Manjulapur) లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నూతన బ్రాంచ్‌ను రీజినల్ మేనేజర్ రంజన్ కుమార్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసి, సులభతరం చేసేందుకు జిల్లా కేంద్రంలో ఐదో బ్రాంచ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఖాతాదారులు బ్యాంకు అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ సుధీర్ కుమార్, కౌన్సిలర్లు చెనిగారపు నరేష్, అయిండ్ల విజయలక్ష్మి, మాజీ సర్పంచ్ చెనిగారపు చిన్నయ్య, ఆఫీసర్ దేవన్న, బ్యాంకు యూనియన్ నాయకుడు టి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

