పది పరీక్షల్లో ట్విస్ట్: సొంత స్కూల్లోనే సెంటర్..!

కలం, వెబ్​ డెస్క్​ : తెలంగాణ పదో తరగతి పరీక్షల (10th Exams) నిర్వహణలో విద్యాశాఖ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూకట్‌పల్లిలోని న్యూ ఏరా స్కూల్‌ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఏ విద్యార్థికైనా వారు చదువుతున్న పాఠశాలలోనే పరీక్షా కేంద్రం కేటాయించడం నిబంధనలకు విరుద్ధం. అయితే ఈ పాఠశాలకు చెందిన 80 మంది విద్యార్థులకు అదే స్కూల్‌ను పరీక్ష కేంద్రంగా కేటాయించడం వెనుక అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో విద్యాశాఖ అధికారులు కుమ్మక్కై, కేవలం మార్కుల కోసమే ఈ విధమైన వెసులుబాటు కల్పించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ వ్యవహారం బయటకు రాకుండా ఉండేందుకు పాఠశాల యాజమాన్యం విద్యార్థులపై ఆంక్షలు విధించడం గమనార్హం. తమ హాల్ టికెట్లను ఎవరికీ చూపవద్దంటూ విద్యార్థులకు హుకుం జారీ చేసినట్లు సమాచారం. పరీక్షల షెడ్యూల్‌కు పది రోజుల ముందే హాల్ టికెట్లు జారీ చేసినప్పటికీ, ఈ కేంద్రాన్ని రహస్యంగా ఉంచడం వెనుక జిల్లా విద్యాధికారి పాత్రపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విద్యాశాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులను శిక్షించాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>