అయ్యప్ప భక్తులకు శుభవార్త.. రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం

కలం, వెబ్ డెస్క్ : అయ్యప్ప భక్తులకు శుభవార్త అందుతోంది. మిథున మాస పూజల నిమిత్తం కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప (Sabarimala) ఆలయం ఆదివారం ( జూన్ 14) నుంచి పునఃప్రారంభం కానుంది. భక్తుల దర్శనార్థం తంత్రి కందరారు మహేష్ మోహనారు సమక్షంలో సాయంత్రం 5 గంటలకు గర్భగుడి తలుపులు తెరుస్తారు. అనంతరం ఆలయ సంప్రదాయం ప్రకారం దీపారాధనను నిర్వహించనున్నారు.

ఇందులో భాగంగా జూన్ 19 వరకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. జూన్ 19న రాత్రి ప్రత్యేక పూజలు ముగిసిన అనంతరం భక్తులకు వీడ్కోలు పలికి ఆలయం మూసివేస్తారు. అయితే స్వామివారి దర్శనం కోరుకునే భక్తులు www.sabarimalaonline.org వెబ్‌సైట్ ద్వారా తమ స్లాట్‌లను బుక్ చేసుకోవాలని ఆలయ అధికారులు సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>