ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఈయూ ఘనవిజయం

​కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ, సీపీఐ అనుబంధ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ) కూటమి 6,500లకు పైగా ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించింది. దీంతో కొత్తగూడెంలో (Kothagudem) విజయోత్సవ ర్యాలీతోపాటు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కంచర్ల జమలయ్య, కందుల భాస్కర్, సాబీర్ పాషా మాట్లాడారు.

ఈ తీర్పు పాలకుల కార్మిక వ్యతిరేక విధానాలకు చెంపపెట్టు అని, కార్మికుల ఐక్యతను చాటిచెప్పిందని అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే తమ ప్రధాన అజెండా అని, కార్మిక హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు భూక్యా శ్రీనివాస్, ఉపేందర్, విజయ్ కుమార్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>