కలెక్టర్ ఆదేశాలతో కళాశాల రహదారికి మరమ్మతులు

కలం, సోన్: సోన్ మండలం కడ్తాల్(Kadthal) గ్రామ శివారులోని తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల డిగ్రీ కళాశాలకు వెళ్లే రహదారికి ఎట్టకేలకు మరమ్మతులు చేపట్టారు. జాతీయ రహదారి నుంచి కళాశాలకు వెళ్లే మార్గం గుంతలమయంగా మారడంతో విద్యార్థినులు, అధ్యాపకులు, సిబ్బంది రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా కళాశాలను సందర్శించిన సమయంలో అధ్యాపకులు రహదారి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

స్పందించిన కలెక్టర్ గ్రామ సర్పంచ్ గుర్రం రాముతో మాట్లాడి రహదారిపై ఉన్న గుంతలను పూడ్చి మరమ్మతులు చేపట్టాలని సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం సర్పంచ్ ఆధ్వర్యంలో రహదారిపై గుంతలను పూడ్చి మరమ్మతులు చేయించారు. దీంతో కళాశాలకు రాకపోకలు సులభతరం కావడంతో అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి చొరవ చూపిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, సర్పంచ్ గుర్రం రాముకు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read : ట్రక్ పార్క్ భూముల వేలం రద్దు చేయాలి : కేటీఆర్ డిమాండ్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>