హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌ (Hyderabad)లో ఉదయాన్నే ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్–బెంగళూరు హైవేపై వెళ్తున్న ఒక కంటైనర్ డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో, ఎదురుగా వస్తున్న ట్రావెల్ బస్సు అదుపు తప్పి, రోడ్డు పక్కనే ఉన్న వాహనాలను ఢీకొంటూ హోటల్‌లోకి దూసుకెళ్లింది.

ఈ ఘటనలో పది మందికి పైగా గాయపడగా.. అజ్మల్ అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. దుబాయ్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న అజ్మల్ మార్గమధ్యలో టీ తాగేందుకు అజ్మల్ హోటల్ వద్ద ఆగగా.. బస్సు ఢీకొట్టింది. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>