పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయాలి.. AITUC డిమాండ్

కలం, నిర్మల్: మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికుల పెండింగ్ బిల్లులు, వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం యూనియన్ (AITUC) ఆధ్వర్యంలో బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. జనవరి నుంచి పెండింగ్‌ లో ఉన్న కోడిగుడ్ల బిల్లులు, జూన్ నుంచి చెల్లించాల్సిన రూ.2 వేల వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టో ప్రకారం మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు రూ.10 వేల వేతనం చెల్లించాలని నాయకులు కోరారు. మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన గ్యాస్ సిలిండర్లు, కోడిగుడ్లను ప్రభుత్వమే నేరుగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, గుర్తింపు కార్డులు, యూనిఫాంలు అందించాలన్నారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్నకు అందజేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>