కలం, వెబ్ డెస్క్: ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి (Eshwar Sai), మాధురి రాథోడ్ మధ్య కొనసాగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది. ఈశ్వర్ సాయి భార్య శరణ్య (Sharanya) ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవల వేములవాడలో ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ఒకే గదిలో ఉన్న సమయంలో శరణ్య వారిని గుర్తించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన అనంతరం దంపతుల మధ్య వివాదం తీవ్రరూపం దాల్చినట్లు తెలుస్తోంది.
ఆడియోలో శరణ్య ఆవేదన
ఆత్మహత్యాయత్నానికి ముందు శరణ్య విడుదల చేసినట్లు చెబుతున్న ఆడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తన జీవితంలో జరిగిన ద్రోహాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని, తన జీవితాన్ని ఆగమాగం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త లేకుండా తాను జీవించలేనని పేర్కొంటూ, తన కుమారుడిని జాగ్రత్తగా చూసుకోవాలని కుటుంబ సభ్యులను కోరినట్లు తెలుస్తోంది. ‘‘ఈ పోరాటంలో మోసపోయాను.. నాకు ఇదొక్కటే మార్గం కనిపిస్తోంది’’ అంటూ ఆమె భావోద్వేగానికి గురైనట్లు సమాచారం.
భర్తపై నమ్మకం ఉందన్న శరణ్య
గతంలో మీడియాతో మాట్లాడిన శరణ్య.. తన భర్త చాలా మంచివాడని, మాధురి రాథోడ్ (Madhuri Rathod) కావాలనే తన భర్త వెంటపడి లొంగదీసుకుందని ఆరోపించారు. ఈశ్వర్ సాయి (Eshwar Sai) లేకుండా తాను బతకలేనని కన్నీరుమున్నీరయ్యారు. ఇదిలా ఉండగా, ఇటీవల ఓ ఫోక్ సాంగ్లో ప్రధాన నటీనటులుగా ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ కలిసి నటించారు. ఇక, ఆత్మహత్యాయత్నానికి దారితీసిన పరిస్థితులపై స్పష్టత రావాల్సి ఉంది. ఘటనపై సంబంధిత వర్గాల నుంచి మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.
Also Read : మమ్మల్ని ఇంటి నుంచి గెంటేశారు! మియాపూర్లో వృద్ధ దంపతుల ఆందోళన
Follow Us On: X(Twitter)

