కలం, సినిమా : మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja), టాలెంటెడ్ యాక్టర్ సునీల్ (Sunil) కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారి కాంబోలో వచ్చే కామెడీ సీన్స్ అంటే ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడతారు. సునీల్, రవితేజ మధ్య ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. తాజాగా రవితేజ హీరోగా నటించిన “భర్త మహాశయులకు విజ్ఞప్తి” మూవీ సంక్రాంతి సందర్భంగా విడుదలయి మంచి విజయం సాధించింది.
కిశోర్ తిరుమల (Kishore Tirumala) తెరకెక్కించిన ఈ సినిమాలో సునీల్ కీలక పాత్ర పోషించారు. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ నిర్వహించగా సునీల్‌తో తనుకున్న ఫ్రెండ్‌షిప్ గురించి రవితేజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా ఇద్దరిది వెటకారంతో కూడిన ఫ్రెండ్‌షిప్. మా అమ్మ, సునీల్ అమ్మ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కావడంతో వారిద్దరి వెటకారమే మాకు వచ్చిందని రవితేజ తెలిపారు.

Read Also: గుణశేఖర్ యుఫోరియా ట్రైలర్ ఎలా ఉందంటే..
Follow Us On: Instagram


