కలం, వలిగొండ : వలిగొండ (Valigonda) మండల కేంద్రంలో శనివారం సాయంత్రం ఆకాశంలో అద్భుత దృశ్యాలు కనువిందు చేశాయి. సాయంత్రం పడమర వైపు వెళ్ళిపోతూ మబ్బుల చాటు నుండి తన కిరణాలను బంగారు వర్ణంలో ప్రసరింపజేసి కనువిందు చేయగా తూర్పు వైపు ఒకేసారి రెండు సప్తవరణాలతో ఇంద్రధనస్సులు ఆకాశంలో కొద్దిసేపు కనిపించి చేశాయి. ఈ దృశ్యాలను తిలకించిన పలువురు తమ సెల్ ఫోన్ లలో బంధించి మిత్రులకు, స్నేహితులకు పంపుకున్నారు.

