కలం, వెబ్ డెస్క్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan Konidela), ఉపాసన (Upasana) దంపతులు కవలలకు జన్మనిచ్చారు. ఒక పాప, ఒక బాబు జన్మించారని మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా హ్యాపీ మూమెంట్స్ పంచుకున్నారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులు శనివారం కవల పిల్లలకు స్వాగతం పలికారని తెలిపారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారన్నారు. అందరి ప్రార్థనలు, ప్రేమ, ఆశీర్వాదాలు, శుభాకాంక్షలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ఉపాసనకు ఇది రెండో కాన్పు. 2023 జూన్ 20న మొదటి కాన్పులో క్లింకారా జన్మించారు. శనివారం రెండో కాన్పులో ట్విన్స్ కు జన్మనిచ్చారు.
With immense joy and a heart full of gratitude, we are happy to share that @AlwaysRamCharan and @upasanakonidela have been blessed with twins – a baby boy and a baby girl.
Both the babies and the mother are healthy and doing well. ✨
Welcoming these little ones into our family…
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 31, 2026


