కలం, వెబ్‌డెస్క్: సివిక్ సెన్స్ విషయంలో ఇప్పటికే ఇండియన్స్‌పై చాలా మంది ఫారినర్స్‌కు ఒక చెడు అభిప్రాయం ఉంది. దీన్ని మరింత చెడగొట్టేలా కొందరు సిటిజన్లు ప్రవర్తించడం అవమానకరంగా మారుతోంది. ఇండియాకు వచ్చే టూరిస్టుల పట్ల నీచంగా ప్రవర్తిస్తూ కొందరు దేశానికే చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. తాజాగా రాజస్థాన్ (Rajasthan)లో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఓ థాయ్‌లాండ్‌కు చెందిన యువతి ఇండియా టూర్‌కు వచ్చింది. రాజస్థాన్‌లో పర్యటిస్తున్న సమయంలో ఆమెను ఒక ఆటో డ్రైవర్ వేధింపులకు గురి చేశాడు. సదరు యువతి యూట్యూబర్ కావడంతో స్థానికంగా ఒక కల్చరల్ ప్రోగ్రామ్‌ను లైవ్ స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ సమయంలో ఆమె వద్దకు ఓ యువకుడు వచ్చాడు. తనకు ముద్దు ఇవ్వాలంటూ పదేపదే అడుగుతూ ఆమెను వేధించాడు. ఆమె వీడియో తీస్తున్నా అలాగే ఇబ్బంది పెట్టాడు. ఆమె అతడికి నో చెప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన నవంబర్ 13న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగింది.
బాధిత యువతి ఆ మరుసటి రోజు తన సోషల్ మీడియా ఖాతాల్లో ఆ వీడియోను పోస్ట్ చేసింది. ఇది కాస్తా వైరల్‌గా మారింది. యువకుడి తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాళ్ల వల్లే ఇండియా పరువు పోతుందని మండిపడ్డారు. దీంతో పోలీసులు సదరు యువకుడిని అరెస్ట్ చేశారు. అయితే బాధిత యువతి మాత్రం ఈ ఘటనపై భిన్నంగా స్పందించారు. ఇండియాలో చాలామందిని కలిశానని, ఈ ఒక్క వ్యక్తి మినహా అందరూ తనతో ఎంతో చక్కగా మాట్లాడారని తెలిపింది. ఒక్క వ్యక్తి ప్రవర్తన ఆధారంగా దేశం మొత్తాన్ని జడ్జ్ చేడయం సరికాదని పేర్కొంది.

