పీసీసీ చీఫ్​ మహేష్ కుమార్ గౌడ్‌కి రాహుల్ గాంధీ ఫోన్

కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) పీసీసీ చీఫ్​ మహేష్ కుమార్ గౌడ్‌కి ఫోన్ చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై ఆరా తీస్తూనే.. ఇటీవల తనకు రాసిన లేఖపై చర్చించినట్లు తెలుస్తోంది. ఓ టీవీ ఛానల్లో తనను టార్గెట్‌ చేసి, దురుద్దేశపూర్వకంగా కథనాలను రోజంతా ప్రసారం చేశారని లేఖలో రాహుల్ గాంధీకి పీసీసీ చీఫ్​ వివరించారు. ఈ అంశంపైనే ప్రధానంగా చర్చించినట్లు గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మహేష్ కుమార్ గౌడ్‌కి మనోధైర్యం చెప్పిన రాహుల్ గాంధీ.. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించినట్లు చెబుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>