జపాన్‌లో చ‌రిత్ర సృష్టించిన ప్ర‌భాస్‌..!

క‌లం, వెబ్ డెస్క్‌: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) జపాన్‌లో మరో అరుదైన ఘనత సాధించారు. జ‌పాన్‌లో ప్ర‌భాస్‌ ప్రజాదరణ రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. తాజాగా జపాన్‌(Japan)కు చెందిన ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్ ‘అనన్’ (Anan) బ్యాక్ కవర్‌పై ప్రభాస్ సింగిల్ ఫోటోతో కనిపించి చరిత్ర సృష్టించారు. ఫిబ్రవరి 10న విడుదల కానున్న అనన్ మ్యాగజైన్ నంబర్ 2483లో ప్రభాస్ ఫోటో ప్రచురితమవుతుంది. ఈ మ్యాగజైన్‌ కవర్‌పై సింగిల్‌గా కనిపించిన తొలి భారతీయ నటుడు ప్రభాస్‌ కావడం విశేషం. గతంలో 2023లో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో విజ‌య‌వంత‌మైన సంద‌ర్భంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి ఈ మ్యాగజైన్ కవర్‌పై కనిపించారు. అయితే ప్రభాస్ మాత్రం ఇప్పుడు సోలోగా చోటు దక్కించుకున్నారు. ఇది జపాన్ ప్రేక్షకుల్లో ప్రభాస్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ను స్పష్టం చేస్తోంది. ‘బాహుబలి’ సినిమా జ‌పాన్‌లో విడుదలైన తర్వాత ప్రభాస్‌కు జపాన్‌లో అభిమానులు పెరగడం మొదలైంది. ఈ కవర్ షూట్‌ను 2025 డిసెంబర్‌లో టోక్యోలో నిర్వహించిన‌ట్లు స‌మాచారం. ఆ సమయంలో ప్రభాస్ సినిమా ప్రచారాలు, అభిమానులతో సమావేశాల కోసం జపాన్ వెళ్లారు. జపాన్ అభిమానులతో ప్ర‌భాస్ ఎప్పటికప్పుడు ట‌చ్ ఉండ‌టం కూడా ఆయ‌న‌కు అక్క‌డ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>