వచ్చే ఎన్నికల్లో భూ భారతితోనే గెలిచి తీరతాం.. మంత్రి పొంగులేటి సవాల్

కలం, ఖమ్మం బ్యూరో: ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘భూ భారతి’ చట్టం అమలే రాబోయే ఎన్నికల్లో తమ ప్రభుత్వ పనితీరుకు అసలైన ప్రామాణికమని పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) సవాల్ విసిరారు. రాబోయే ఎన్నికల్లో దీనిపైనే పోటీ చేసి గెలిచి తీరుతామని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని బేతుపల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన భూ రీసర్వే అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

భూమి అనేది రైతులకు కేవలం మన్ను కాదని, అది వారి గుండెకాయ లాంటిదని మంత్రి అభివర్ణించారు. గత ప్రభుత్వంలో ‘ధరణి’ పేరుతో జరిగిన అక్రమాలకు స్వస్తి పలికామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాగార్జునసాగర్ పైలట్ ప్రాజెక్ట్ సర్వేలో వేలాది ఎకరాల భోగస్ భూములు వెలుగుచూశాయని, అందుకే ఇప్పుడు బేతుపల్లితోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆధునిక రోవర్ టెక్నాలజీతో ప్రతి అంగుళం భూమిని కొలుస్తున్నామని తెలిపారు.

22A ప్రొహిబిటెడ్ లిస్ట్ పేరుతో అమాయక ప్రజలను అడ్డుపెట్టుకుని అక్రమార్కులకు పాల్పడినవారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. అక్రమార్కుల నుంచి ‘సిట్’ (SIT) ద్వారా ముక్కు పిండి వసూలు చేస్తామని స్పష్టం చేశారు.

ప్రతి జిల్లాకు స్వయంగా వెళ్తానని, రైతులతో అక్రాస్ ది టేబుల్ మాట్లాడి భూసమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ​ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, రెవెన్యూ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>