కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ (Nirmal Excise) హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ యూనియన్ ఎన్నికలు గురువారం నిర్వహించారు. ఈ ఎన్నికలలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూనియన్ అధ్యక్షుడిగా జాదవ్ శ్యామ్‌రావు, ప్రధాన కార్యదర్శిగా రాజేశ్వర్, కోశాధికారిగా సాయిని మహేష్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా లింబాద్రి, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా ఆర్. సురేష్ సింగ్, సంయుక్త కార్యదర్శిగా బి. మేరీ, ప్రచార కార్యదర్శిగా పి. శిరీష ఎన్నికయ్యారు.
ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా వంశీధర్, సౌజన్య ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఎన్. రంగస్వామి, సబ్ ఇన్‌స్పెక్టర్ కే. అభిషేకర్, సీనియర్ అసిస్టెంట్ సరోజ, జూనియర్ అసిస్టెంట్ దేవిక వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్ల సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు యూనియన్ తరఫున నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.

