వనపర్తి జడ్పీ హైస్కూల్ పేరును మార్చాలి.. కలెక్టర్‌కు వినతి!

కలం, వనపర్తి: వనపర్తి (Wanaparthy) పట్టణంలోని గాంధీనగర్‌లో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జడ్పీహెచ్‌ఎస్‌) హరిజనవాడ పేరు (Harijanwada School Name) లో మార్పులు చేయాలని వనపురి ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ చైర్మన్ బత్తుల శ్రీనివాసులు జిల్లా కలెక్టర్‌ను కోరారు. బాలల ప్రజావాణి సందర్భంగా ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. గతంలో దళితులను ఉద్దేశించి ఉపయోగించిన ‘హరిజన’ పదం ప్రస్తుతం సమాజంలో వాడుకలో లేదని, పాఠశాల పేరులో ఆ పదం కొనసాగడం వల్ల విద్యార్థులు ఆత్మన్యూనతాభావానికి గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఈ పాఠశాలలో అన్ని వర్గాలకు చెందిన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని, గతంలో 150 లోపు ఉన్న విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం 350 దాటిందని తెలిపారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థులు, తల్లిదండ్రుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని పేరులోని ‘హరిజనవాడ’ పదాన్ని తొలగించి, నూతన పేరును అధికారికంగా ఖరారు చేయాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>