కలం, వెబ్ డెస్క్ : ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతోంది. పోలవరం ఎడమ కాలువ (Polavaram Left Canal) ద్వారా పారే గోదావరి జలాలు నేడు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చేరుకోనున్నాయి. ఈ చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) గోదావరి జలాలను లాంఛనంగా విడుదల చేయనున్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద సమీపంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించి, గోదావరి మాతకు జలహారతి ఇచ్చి నీటిని స్వాగతించనున్నారు.
ఉత్తరాంధ్రలోని 4 జిల్లాల తాగు, సాగునీటి అవసరాలను తీర్చేందుకు ఈ పథకం ఎంతో కీలకంగా మారనుంది. సుమారు రూ.4,192 కోట్ల భారీ వ్యయంతో పోలవరం ఎడమ కాలువ (Polavaram Left Canal) నిర్మాణ పనులను ప్రభుత్వం వేగవంతంగా పూర్తి చేసింది. ఈ కాలువ ద్వారా నీటి విడుదల ప్రారంభం కావడంతో ఉత్తరాంధ్రలో వ్యవసాయ భూములకు పుష్కలంగా సాగునీరు అందడంతో పాటు ప్రధాన నగరాలు, గ్రామీణ ప్రాంతాలకు తాగునీటి ఎద్దడి తీరనుంది.
Also Read : యూఎస్‌లో తెలుగు వారి కథ: షాకింగ్ వీడియో వైరల్!
Follow Us On : WhatsApp

