కలం, వెబ్ డెస్క్: దేశంలోని మూడు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) పుట్టిన రోజు శుభాకాంక్షలు (Birthday Wishes) తెలిపారు. మణిపూర్ సీఎం యుమ్‌నామ్ ఖెమ్‌చంద్ సింగ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ పుట్టిన రోజులు ఒకే రోజు కావడం విశేషం. ఈ మేరకు ముగ్గురికి విషెస్ చెప్తూ మోడీ ఎక్స్ వేదికగా వేర్వేరు పోస్టులు చేశారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin)కు శుభాకాంక్షలు, ఆయనకు దీర్ఘాయుష్సు, ఆరోగ్యవంతమైన జీవితం అందాలని ప్రార్థిస్తున్నా అని మోడీ ఒక పోస్టులో పేర్కొన్నారు. మణిపూర్ సీఎం యుమ్‌నామ్ ఖెమ్‌చంద్ సింగ్ (Yumnam Khemchand Singh) ఎంతో అనుభవజ్ఞుడని, మణిపూర్ రాష్ట్ర అభివృద్ధి, మంచి పాలనకు ఎంతో కృషి చేస్తున్నారని, ఆయన ప్రజలకు సేవ చేస్తూ దీర్ఘాయుష్సు పొందాలని కోరారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar)కు కూడా మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఏళ్ల తరబడి బీహార్ అభివృద్ధి కోసం అచంచలంగా పని చేస్తున్నారని, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎంతోమంది జీవితాలను ప్రభావితం చేశాయని తెలిపారు.

