ప్లాస్టిక్‌ రహితంగా చిట్యాల్‌.. డిప్యూటీ కమిషనర్‌ అభినందన

కలం, నిర్మల్: గ్రామాన్ని ప్లాస్టిక్‌ రహితంగా (Plastic Free Village) తీర్చిదిద్దేందుకు చిట్యాల్ (Chityal) గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం, దానిని అమలు చేస్తున్న తీరు అభినందనీయమని పంచాయతీరాజ్‌ డిప్యూటీ కమిషనర్‌ సుధాకర్‌ అన్నారు. మంగళవారం ఆయన నిర్మల్‌ రూరల్‌ మండలం చిట్యాల్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్మిస్తున్న ఫామ్‌ పాండ్లను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం గ్రామ సర్పంచ్‌ ఏనుగు సుప్రియ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో పాలకవర్గంతో సమావేశం నిర్వహించారు.

గ్రామంలో ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు గ్రామస్తులంతా ఏకతాటిపైకి రావడం అభినందనీయమని సుధాకర్‌ అన్నారు. చిట్యాల్ గ్రామం రాష్ట్రంలోనే ప్లాస్టిక్‌ రహిత గ్రామంగా ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ప్లాస్టిక్‌ వినియోగం వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రత్యామ్నాయాలను వినియోగించేలా ప్రోత్సహించాలని సూచించారు. రైతులు ఫామ్‌ పాండ్లను నిర్మించుకునేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున, వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ఫామ్‌ పాండ్ల నిర్మాణాలను విస్తృతంగా చేపట్టాలని తెలిపారు. వర్షపు నీటిని వృథా కాకుండా నిల్వ చేసుకోవడం ద్వారా సాగు, భూగర్భ జలాల పెంపునకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకుని వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు గ్రామస్థులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌, డీఆర్‌డీవో పీడీ విజయలక్ష్మి, ఎంపీడీవో సుధాకర్‌, ఏపీవో రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>