మళ్లీ పెద్ది విగ్రహం ఏర్పాటు.. నర్సంపేటలో హై టెన్షన్

కలం, నర్సంపేట: దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి (Peddi Sudarshan Reddy) విగ్రహ ఏర్పాటుపై వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో హై టెన్షన్ నెలకొంది. మున్సిపల్‌ అధికారులు నిన్న రాత్రి గద్దె కూల్చివేయగా.. అదే ప్రాంతంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు మళ్లీ నిర్మించి, పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. నర్సంపేట ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఎదురుగా ఉన్న ప్రాంతంలో పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు బీఆర్ఎస్ నేతలు తొలుత గద్దె నిర్మించారు. మున్సిపాలిటీ అనుమతులు లేకపోవడం, స్థలం వివాదం కారణంగా మున్సిపల్‌ అధికారులు ఆదివారం రాత్రి గద్దెను కూల్చివేశారు.

పోలీసులు అప్రమత్తం..

సోమవారం ఉదయం ఎర్రబెల్లి దయాకర్ రావు, బోయినపల్లి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం పార్టీ శ్రేణులు మళ్లీ అక్కడికి చేరుకుని తిరిగి గద్దె నిర్మాణాన్ని చేపట్టి, గంటల వ్యవధిలోనే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని (Peddi Sudarshan Reddy Statue) ఏర్పాటు చేసి ఆవిష్కరించారు. విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్దఎత్తున నినాదాలు చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మెడికల్‌ కాలేజీ పరిసరాల్లో పోలీసులను మోహరించారు.

Also Read : తెలంగాణలో జనసేన ఎంట్రీకి రాజాసింగ్ పిలుపు.. పవన్ కల్యాణ్‌కు కీలక విజ్ఞప్తి!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>