కలం, నిర్మల్ : పండుగ సాయన్న స్ఫూర్తితో తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులు రాజకీయంగా ఎదిగి పాలకులుగా మారాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు యాటకారి సాయన్న ముదిరాజ్ అన్నారు. సారంగాపూర్ (Sarangapur) మండల కేంద్రంలో శనివారం పండుగ సాయన్న జయంతిని ఘనంగా నిర్వహించి.. ఆయన విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా యాటకారి సాయన్న మాట్లాడుతూ.. 19వ శతాబ్దంలో భూస్వామ్య పాలకులను ఎదిరించి అణగారిన వర్గాలకు అండగా నిలిచిన యోధుడు పండుగ సాయన్న అని కొనియాడారు. అలాంటి మహనీయుడి ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భూమన్న, ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు.

