ప్రైవేట్ బస్సు-ఆటో ఢీ.. ఆరుగురు దుర్మరణం!

కలం, వెబ్ డెస్క్ : పల్నాడు జిల్లా చిలకలూరిపేట (Chilakaluripet) వద్ద బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి తిరుపతి వైపు వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో, వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

చిలకలూరిపేట అడ్డరోడ్డు సెంటర్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. మృతులంతా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. వీరంతా తమ బంధువుల ఇంట్లో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు కొండమంజులూరు వెళ్లారు. వేడుకలు ముగించుకుని తిరిగి ఆటోలో వేలూరు వస్తుండగా, ఊహించని విధంగా ఈ ప్రమాదం బారిన పడ్డారు.

ఈ ప్రమాదంలో బొంతా మంగమ్మ, బొంతా బాబురావు, బొంతా గంగమ్మ, బొంతా సంపూర్ణమ్మ, బొంతా మరియమ్మ, ఎస్.లక్ష్మమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు మృతి చెందడంతో వేలూరు గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>