కలం, నిర్మల్: బాసర(Basara) మండల కేంద్రంలోని పద్మశాలి సంఘ భవనంలో జంధ్యాల పౌర్ణమి, రక్షాబంధన్ వేడుకలను శుక్రవారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి కుల బాంధవుడైన మార్కండేయ మహర్షి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పద్మశాలి కులస్తులు సామూహికంగా నూలు పోగులతో కూడిన జంధ్యాలను ధరించారు. అనంతరం కుల బాంధవులు ఒకరికొకరు రాఖీలు కట్టుకుని “నేను మీకు రక్ష.. మీరు మాకు రక్ష.. మనమంతా కలిసి దేశానికి రక్ష” అనే సందేశాన్ని చాటారు.
ఈ సందర్భంగా పద్మశాలి సంఘం (Padmashali Sangam) అధ్యక్షుడు ఓని స్వామి మాట్లాడుతూ.. జంధ్యాల పౌర్ణమి, రక్షాబంధన్ పండుగలు పద్మశాలీలకు అత్యంత ప్రీతికరమైనవని తెలిపారు. పద్మశాలి కుల బాంధవులంతా ఐక్యంగా ఉంటూ భగవంతుని సేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కుల గంగాధర్, మాజీ ఎంపీటీసీ జెంటిల శ్యామ్, ప్రధాన కార్యదర్శి విజయ్, మేకల అశోక్, అంకం రమేష్, మహేష్, అంకం రాకేష్, సంతోష్, రాములు, శివగణేష్, రుద్రారం చిన్న రాజన్న, జువ్వల రాజు, పాకి ముత్యన్న తదితరులు పాల్గొన్నారు.

