Mobile Popup Ad
Mobile Popup Ad

‘మహానాడు’లో ఎన్టీఆర్ డ్యాన్స్.. వీడియో వైరల్!

క‌లం, వెబ్ డెస్క్: టీడీపీ (TDP) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు (Mahanadu) సందర్భంగా సోషల్ మీడియాలో ఒక అరుదైన వీడియో వైరల్‌గా మారింది. 1986లో జ‌రిగిన మ‌హానాడు వేదిక‌పై పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు, దివంగ‌త సీఎం ఎన్టీఆర్ (NTR) ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న వీడియో ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను ఆక‌ట్టుకుంటోంది. నాటి మ‌హానాడు కార్య‌క్ర‌మంలో క‌ళాకారులు స్టేజీపై ప్ర‌ద‌ర్శ‌న ఇస్తుండ‌గా ఎన్టీఆర్ కూడా వారిలో ఒక‌రిగా క‌లిసిపోయి స్టెప్పులు వేస్తూ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉత్సాహ‌ప‌రిచారు. క‌ళాకారులు సైతం ఎంతో సంతోషంగా ఎన్టీఆర్ చుట్టూ చేరి డ్యాన్స్ చేశారు.

తాజాగా జ‌రుగుతున్న మ‌హానాడు (Mahanadu) సంద‌ర్భంగా టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, ఎన్టీఆర్ అభిమానులు ఆయ‌న జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఈ వీడియోను పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. సుమారు 40 ఏళ్ల కింద‌టి ఈ వీడియోను నెటిజ‌న్లు సైతం ఆస‌క్తిగా చూస్తున్నారు. ఎన్ని త‌రాలు మారినా ఎన్టీఆర్ తెలుగు ప్ర‌జ‌ల గుండెల్లో చిర‌స్థాయిగా నిలిచిపోతార‌ని కామెంట్ చేస్తున్నారు. ఇక మ‌రోవైపు ఏఐ టెక్నాల‌జీని వాడి ఎన్టీఆర్‌ను మ‌హానాడు వేదిక‌పై మ‌ళ్లీ చూపించేందుకు టీడీపీ అధిష్టానం ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

Read Also: విద్యా రంగంపై తీవ్ర నిర్లక్ష్యం.. జూన్ 5న భారీ ఆందోళన

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>