కలం, జోగులాంబ గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గద్వాల (Gadwal) మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే మండల ప్రజావాణి (Mandal Prajavani)లో ఫిర్యాదులు కరువయ్యాయి. సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఏ మాత్రం ఫిర్యాదులు అందలేదు. అయితే గత మూడు నెలల నుంచి నిర్వహించిన ప్రజావాణికి కేవలం 28 ఫిర్యాదులే అందాయి. దీనిపై ఎంపీఓ పద్మావతి మాట్లాడుతూ.. ఏదైనా సమస్య ఉంటే ప్రజావాణిలో ఫిర్యాదు చేయాలని, ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండల పరిధిలోని నెలకొన్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డీటీ అజిత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

