కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ (Nizamabad ) స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మానసిక, అంధ దివ్యాంగ విద్యార్థులకు డ్రాయింగ్ పెయింటింగ్, క్విజ్, ఉపన్యాస పాటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్జిలుగా విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత విజయానందరావు, దారం గంగాధర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలు గ్రూపులుగా విభజించిన విద్యార్థిని విద్యార్థులకు సుమారు 48 నుండి 50 ప్రశ్నలను అడిగారు. అందుకుగాను విద్యార్థులు సమాధానాలు ఇచ్చారు. అనంతరం అంధ విద్యార్థులకు ఉపన్యాసం, పాటల పోటీలను నిర్వహించారు. అలాగే మానసిక దివ్యాంగ విద్యార్థిని విద్యార్థులు చిత్రీకరించిన చిత్రాలను, పాడుతున్న పాటలను తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పిల్లల్లో సకలాంగుల కన్నా దీటుగా ఎంతో మేధోసంపత్తి దాగుందని వారు చెప్పిన సమాధానాలకు వారు చిత్రీకరించిన చిత్రాలను చూసి తెలుసుకోవడం జరిగిందన్నారు.
నేటి ప్రస్తుత రోజుల్లో అన్ని రకాల ప్రోత్సాహకాలు తల్లిదండ్రులు వెంట ఉన్నప్పటికీ ఎన్నో రకాల సహాయ సహకారాలు అందించినప్పటికీ చాలామంది చిన్నారులు, యువత తమ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతున్నారని తెలిపారు. ఇక్కడ విద్యార్థులు మానసిక దివ్యంగా విద్యార్థుల అయినప్పటికీ వారు స్వయంగా చదవలేనప్పటికీ వారు ఎంతో ఓపికగా ఉపాధ్యాయ సిబ్బంది చెప్పిన మాటలను పాఠాలను వింటూ నేర్చుకొని ఎలాంటి భయాందోళన లేకుండా ధైర్యంగా చెప్పడం స్నేహ సొసైటీ నిర్వాహకుల, ఉపాధ్యాయ సిబ్బంది పనితీరుకు నిదర్శనం అన్నారు.
మానసిక స్థితి బాగోలేని పిల్లలను నిర్లక్ష్యం వహించే తల్లిదండ్రులకు ఈ స్నేహ సొసైటీ నిర్వాహకులు ఎస్ సిద్దయ్య, ప్రిన్సిపాల్ జ్యోతి , ఉపాధ్యాయ సిబ్బంది దిక్సూచిగా నిలుస్తున్నారని అభినందించారు.. గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని గురువులైన దాసరి విజయనందరావు, దారం గంగాధర్ లను స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య, ప్రిన్సిపాల్ జ్యోతి శాలువాలు, జ్ఞాపకిలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య, అందుల పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి, మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి దాతలు రామ్ సృజన్ రాధికలు పాల్గొన్నారు.

