జీవో నంబర్ 25ను సవరించాల్సిందే.. నిర్మల్‌లో టీచర్ల నిరసన

కలం, నిర్మల్: పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల సర్దుబాటు కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 25 శాస్త్రీయంగా లేదని ఉపాధ్యాయులు మండిపడ్డారు. విద్యార్థుల బోధనకు విఘాతం కలిగించే ఈ జీవోను వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని (Nirmal) బుధవారం లక్ష్మణచాంద మండల కేంద్రంలో నిర్వహించిన శిక్షణ తరగతుల భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులు (Teachers) నిరసన తెలిపారు. 20 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు, 21 నుంచి 40 మంది విద్యార్థులకు ముగ్గురు ఉపాధ్యాయులు, 41 నుంచి 60 మంది విద్యార్థులకు నలుగురు ఉపాధ్యాయులను కేటాయించాలని కోరారు.

అలాగే 60 మందికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలకు ఒక ప్రధానోపాధ్యాయుడు 60 నుంచి 80 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలకు అదనంగా ఒక పీఈటీ ఉపాధ్యాయుడిని నియమించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు దాసరి శంకర్, ప్రధాన కార్యదర్శి పెంట అశోక్‌తో‌పాటు శిక్షణ తరగతులకు హాజరైన ప్రాథమిక ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Read Also: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>