కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లావ్యాప్తంగా జోరు వానలు (Nirmal Rains) కురుస్తున్నాయి. గత 24 గంటల్లో జిల్లాలో సరాసరిగా 82.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న ఈ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాత వివరాలను పరిశీలిస్తే, నిర్మల్ జిల్లా కేంద్రంలో అత్యధికంగా 132.3 మిల్లీమీటర్ల భారీ వర్షం కురిసింది. అలాగే కడెం మండలంలో 131.2 మి.మీ, సోన్ లో 130.3 మి.మీ, మామడలో 115.8 మి.మీ, నిర్మల్ రూరల్ లో 110.6 మి.మీ, మరియు ఖానాపూర్ లో 108.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగతా ప్రాంతాలైన లక్ష్మణచందాలో 98.4 మి.మీ, దిలావర్పూర్ లో 93.6 మి.మీ, దస్తురాబాద్ లో 89.1 మి.మీ, పెంబిలో 84.3 మి.మీ, నర్సాపూర్ (జి) లో 82.1 మి.మీ, బైంసాలో 75.8 మి.మీ, సారంగాపూర్ లో 73.7 మి.మీ, బాసరలో 65.9 మి.మీ, కుంటాలలో 51.7 మి.మీ, లోకేశ్వరంలో 50.5 మి.మీ, ముధోల్ లో 32 మి.మీ, కుబీర్ లో 25.1 మి.మీ, తానూర్ లో అత్యల్పంగా 23.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయినట్లు అధికారులు తెలిపారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

