నిర్మల్ మార్కెట్లలో త్రివర్ణ పతాకాల సందడి

కలం, నిర్మల్: స్వాతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో శుక్రవారం సందడి నెలకొంది. శనివారం నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రజలు, అధికారులు, విద్యార్థులు సిద్ధమవుతున్నారు. దీంతో పట్టణంలోని మార్కెట్లు త్రివర్ణ పతాకాల (Tricolour Flags) కొనుగోళ్లతో కిటకిటలాడాయి. జాతీయ నాయకుల చిత్రపటాలు, మూడు రంగుల జెండాలు, తోరణాలను ప్రజలు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, గ్రామపంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాలలో జాతీయ జెండాలను ఎగురవేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

నిర్మల్‌లోని స్థానిక బస్టాండ్, ఓల్డ్ బస్టాండ్, నారాయణరెడ్డి మార్కెట్ ప్రాంతాలలో జాతీయ జెండాల విక్రయాలు జోరుగా సాగాయి. చిన్నారులు, యువతతో పాటు వివిధ వర్గాల ప్రజలు జెండాలను కొనుగోలు చేస్తూ కనిపించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకోసం పెద్ద సంఖ్యలో జెండాలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో నిర్మల్ మార్కెట్ ప్రాంతాలలో  ఎటుచూసినా త్రివర్ణ పతాకాలు దర్శనమిస్తూ దేశభక్తి వాతావరణం కనిపించింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పట్టణంలో ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>