కలం, వనపర్తి: వనపర్తి మండలం చిట్యాలలోని MJPTBCWR బాలుర జూనియర్ కళాశాల (Junior College) నూతన భవన నిర్మాణానికి రూ.10 కోట్ల నిధులు మంజూరయ్యాయి. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (MLA Megha Reddy) ప్రత్యేక చొరవతో బీసీ సంక్షేమ శాఖ G.O.Rt.No.93, తేదీ 16-07-2026 ద్వారా ఈ నిధులకు పరిపాలనా అనుమతులు లభించాయి. నిర్మాణ పనులను TGEWIDC ద్వారా చేపట్టేందుకు ఈ నెల 5న ప్రభుత్వం అనుమతించింది. ప్రస్తుతం ఉన్న MJPTBCWR బాలుర పాఠశాల ప్రాంగణంలోని స్థలంలో జూనియర్ కళాశాల భవనాన్ని నిర్మించనున్నారు.
గ్రామీణ విద్యార్థులకు మెరుగైన వసతులు
గ్రామీణ ప్రాంతాల బీసీ విద్యార్థులకు (BC Students) మెరుగైన విద్యా వాతావరణం కల్పించడం, ఇంటర్మీడియట్ విద్యను సౌకర్యవంతంగా అభ్యసించే అవకాశం కల్పించడమే లక్ష్యంగా ఈ భవనాన్ని నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలో విద్యా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నిధుల మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీ డాక్టర్ మల్లు రవికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
Also Read : ఇకపై టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన పనిలేదు.. ఫిబ్రవరి నుంచి కొత్త డిజిటల్ విధానం
Follow Us On: X(Twitter)

