కలం, కరీంనగర్: రాష్ట్రస్థాయి జూడో కరాటే అండర్ -19 (U19 Judo Karate) మహిళ విభాగంలో విద్యార్థిని పంబాల ఆరాధ్య యాదవ్ (Aradhya Yadav) మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించారని కరాటే కోచ్ యం. శ్రీధర్ కుమార్ తెలిపారు. తమిళనాడు రాష్ట్రం పరితిపట్టులోని వేలమాల విద్యాలయంలో గురువారం పోటీలు జరిగినట్లు తెలిపారు. విద్యార్థిని ఆరాధ్య యాదవ్ కరీంనగర్ వివేకానంద రెసిడెన్షియల్ స్కూల్ లో 9వ తరగతి చదువుతోందని పేర్కొన్నారు. సీబీఎస్ఈ సౌత్ జోన్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల అండర్ -19 విద్యార్థినులు పోటీల్లో పాల్గొన్నారు.
Also Read : దులీప్ ట్రోఫీ విజయం వెనుక ఎంఎస్ ధోనీ హస్తం!
Follow Us On: X(Twitter)

