Mobile Popup Ad
Mobile Popup Ad

కామన్వెల్త్ గేమ్స్ ఒలింపిక్స్‌తో సమానమే: నీరజ్ చోప్రా

కలం, స్పోర్ట్స్ : ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్‌లు లేకపోయినా 2026 సీజన్ ఏమాత్రం తేలిక కాదని భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) స్పష్టం చేశాడు. కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు ఉండటంతో ఈ ఏడాది కూడా పోటీ తీవ్రంగానే ఉంటుందని తెలిపాడు. దోహాలో జరిగిన డైమండ్ లీగ్ మీడియా సమావేశంలో మాట్లాడిన నీరజ్, ఒలింపిక్స్ లేదా ప్రపంచ చాంపియన్‌షిప్ లేకపోవడం వల్ల మానసిక ఒత్తిడి కొంత తగ్గవచ్చని పేర్కొన్నాడు. అయితే శారీరకంగా మాత్రం ప్రతి ఏడాది మాదిరిగానే అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి కష్టపడాల్సి ఉంటుందని వివరించాడు.

కామన్వెల్త్ గేమ్స్ జావెలిన్ పోటీ ఈసారి అత్యంత కఠినంగా ఉండబోతోందని నీరజ్ అభిప్రాయపడ్డాడు. పాకిస్థాన్ ఒలింపిక్ ఛాంపియన్ అర్షద్ నదీమ్, శ్రీలంకకు చెందిన రుమేష్ తరంగ పతిరాగే మాత్రమే కాకుండా గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్స్, కేశోర్న్ వాల్కాట్ వంటి ప్రపంచ స్థాయి అథ్లెట్లు కూడా బరిలో ఉండనున్నారని గుర్తుచేశాడు. 90 మీటర్లకు పైగా జావెలిన్ విసిరిన పలువురు అథ్లెట్లు పోటీలో ఉండటంతో కామన్వెల్త్ గేమ్స్ స్థాయి ఒలింపిక్స్ లేదా ప్రపంచ చాంపియన్‌షిప్‌లకు ఏమాత్రం తీసిపోదని నీరజ్ పేర్కొన్నాడు.

ఈ పోటీ చాలా కఠినంగా ఉండబోతుందని చెప్పాడు. దోహాలో గాలి పరిస్థితుల గురించి కూడా నీరజ్ మాట్లాడాడు. అక్కడ అనుకూల గాలులు ఉన్నప్పటికీ, వాటిని సరిగ్గా ఉపయోగించుకోవడం ఎంతో ముఖ్యమని వివరించాడు. కేవలం గాలి సహకరిస్తే సరిపోదని, జావెలిన్‌ను సరైన కోణంలో విసిరితేనే దూరం పెరుగుతుందని తెలిపాడు. ఈ సీజన్‌లో ఒలింపిక్స్ లేదా ప్రపంచ టైటిల్ లేకపోయినా, తనపై ఉండే సవాళ్లు మాత్రం ఏమాత్రం తగ్గవని నీరజ్ స్పష్టం చేశాడు. కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంపైనే తన దృష్టి ఉందని తెలిపాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>