మావల పార్కులో అటవీ అమరవీరుల దినోత్సవం

కలం, ఆదిలాబాద్ : అటవీ, వన్యప్రాణుల సంరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అటవీ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఆదిలాబాద్ (Adilabad) డివిజన్ ఎఫ్‌డీఓ ప్రతమేష్ కేశవ్ తిజారే అన్నారు. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆదిలాబాద్‌ లోని మావల పార్కులో ఉన్న అటవీ అమరవీరుల స్తూపం వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఇంద్రవెల్లి రేంజ్ పరిధిలోని దస్నాపూర్ బీట్‌లో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన ఎఫ్‌బీఓ గౌస్ మొయినుద్దీన్, ఇచ్చోడ రేంజ్‌లో విధి నిర్వహణలో ఉండగా ముల్తానీలో దారుణ హత్యకు గురైన మాంత్యా నాయక్ త్యాగాలను ప్రత్యేకంగా స్మరించుకున్నారు. అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణలో అటవీ సిబ్బంది అందిస్తున్న సేవలు ఎంతో కీలకమని ఎఫ్‌డీఓ పేర్కొన్నారు. అమరవీరుల ధైర్యం, అంకితభావం, విధి నిర్వహణ పట్ల నిబద్ధత ప్రస్తుత అటవీ సిబ్బందికి ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>