కేజీబీవీని సందర్శించిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్

కలం యాదగిరిగుట్ట: అడ్డగూడూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (Addagudur KGBV) శుక్రవారం అదనపు కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ కేజీబీవీలో విద్యార్థినులకు అందుతున్న విద్య, వసతులు, భోజనం, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులతో మాట్లాడి వారి విద్యాభ్యాసం, వసతులపై చర్చించారు.

విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత సాయికి ఎదగాలని విద్యార్థులకు అదనపు కలెక్టర్ సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు విద్యార్థినుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>